తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 12,480 కరోనా పరీక్షలు
  • 50 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 35 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 45 మంది
  • ఇంకా 377 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. గడచిన 24 గంటల్లో 12,480 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఒక్క హైదరాబాదులోనే 35 కొత్త కేసులు గుర్తించారు. హైదరాబాదులో నిన్న 17 కేసులు వెలుగుచూడగా, నేడు రెట్టింపు నమోదయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలో 9, హనుమకొండ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, మహబూబ్ నగర్ జిల్లాలో 1, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 45 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,948 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,460 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 377 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona
Positive Cases
Daily Update

More Telugu News